Maha Shivratri Special Temple: మహా శివరాత్రి వస్తుంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా శివ నామస్మరణ చేసుకుంటారు. తమ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి రాత్రి పూట ఆలయంలో ఉన్న పరమేశ్వరుడిని స్మరించుకుని, జాగారం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం పండుగను కొత్తగా జరుపుకోవడానికి అందరూ ఇష్టపడతారు. ఈ దేవాలయం ఆలోచనకు తగ్గట్టుగానే ఉంటుంది. ఈ సారి ఇక్కడ ఉన్నా శివ పార్వతులను దర్శించుకోవడం మరిచారో మరో సంవత్సరం వేచి ఉండాల్సిందే బాబు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ దేవలయాన్ని కేవలం శివరాత్రి రోజు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచుతారు. మిగిలిన సంవత్సరమంతా మూసేస్తారు. ఈ నెల ఫిబ్రవరి 18న మహా శివరాత్రి సందర్భంగా శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయానికి మీ కుటుబంతో, స్నేహితులతో వెళ్లి మీ జీవితంలో ఒక పేజీని గుర్తిండిపోయేలా చేసుకోండి మిత్రమా !
మహా దేవుడికి ప్రత్యేక పూజలు: ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం లభించే అతి ప్రాచీనమైన శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయంలో ఉన్న మహా దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పురాతనమైన దేవాలయం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో కొలువై ఉంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆలయంలో అభిషేకాలు నిర్వహిస్తుంటారు. వారి మనుసులో ఉన్న కోరికలను ఆ పరమేశ్వరుడికి తెలియజేస్తారు. ఇక్కడ వెలిచిన నీలకంఠుడిని చూడడానికి భక్తలు పోటీ పడుతుంటారు.
శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయం చరిత్ర: తూర్పు చాళుక్యుల కాలంలో బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి గ్రామంలోని నలుదిక్కుల నాలుగు శివాలయాలు నిర్మించారు. వాటిలో ఒకటైన జైన దేవాలయంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. అప్పుడు జరిగిన యుద్ధాలలో ఈ ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆలయం మూత పడింది. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని సంవత్సరానికి ఒక రోజు మాత్రమే తిరిగి తెరుస్తున్నారు. అది కూడా శివరాత్రి పర్వదినానే భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినాన తెల్లవారుజామున పరమేశ్వరుడి దర్శనం చేసుకుంనేందుకు భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తారు. పండగ రోజంతా భక్తులతో ఆలయం కోలాహలంగా మారుతుంది. భక్తులందరూ ఆనందంతో ఇళ్లకు తిరుగు ప్రయాణం చేస్తారు. ఇప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మళ్లీ వచ్చే మహా శివరాత్రి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు.
ఇవీ చదవండి