తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 650 మంది విద్యార్థులు చదువుతున్నారు. కరోనా వైరస్ కారణంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మూడు కేజీల బియ్యం, 30 వేరుశనగ అచ్చులు, 30 కోడిగుడ్లు ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు అందిస్తోంది.
ఇందులో భాగంగా రావులపాలెం పంచాయతీ కార్యాలయానికి సరుకులు సరఫరా చేశారు. వీటిలో కోడిగుడ్లు కుళ్ళిపోయి వాసన రావడం గమనించిన ఈటీవీ భారత్ కథనాన్ని ప్రచురించింది. సమస్యను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బరాజు దృష్టికి తీసుకెళ్లింది. కుళ్లిన కోడిగుడ్ల సరఫరా నిలుపుదల చేస్తామని ప్రధాన ఉపాధ్యయుడు హామీ ఇచ్చారు.
తమ పాఠశాలకు బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ నుంచి కోడుగుడ్లు సరఫరా అవుతాయని, వారికి విషయాన్ని తెలిపి తిరిగి పంపించేస్తామని చెప్పారు.
ఇవీ చూడండి: