కూతురు, అల్లుడు గొడవ పడుతుండగా ఆపేందుకు ప్రయత్నించిన అత్తపై మద్యం మత్తులో అల్లుడు రాడ్తో దాడి చేయగా ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఏసుబాబు రోజు మద్యంతాగి ఇంటికొచ్చేవాడు. ఎప్పటిలాగానే తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. వృద్ధురాలైన అత్త నూకారత్నం.. అల్లుడిని వారించే ప్రయత్నం చేసింది. మద్యం మత్తులో ఏసుబాబు రాడ్తో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు...కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఏసుబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చూడండి. అమ్మా.. అని పిలిపించుకోకముందే.. ఆ తల్లి..