ETV Bharat / state

Somu On Liquor Prices: రూ.50 కే చీప్ లిక్కర్ అమ్మితే కుటుంబానికి రూ.2 లక్షలు మిగులుతాయి: సోము

Somu Veerraju On Liquor Prices: లిక్కర్ ధరలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం చీప్‌ లిక్కర్‌ రూ.50కే అమ్మాలన్న సోము.. అలా అమ్మితే కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షలు మిగులుతాయన్నారు.

రూ.50 కే చీప్ లిక్కర్ అమ్మితే కుటుంబానికి రూ.2 లక్షలు మిగులుతాయి

author img

By

Published : Dec 31, 2021, 4:48 PM IST

రూ.50 కే చీప్ లిక్కర్ అమ్మితే కుటుంబానికి రూ.2 లక్షలు మిగులుతాయి

Somu Veerraju On Liquor Prices: అధికారంలోకి వస్తే లిక్కర్​ను రూ. 70కే విక్రయిస్తామంటూ తాను చేసిన వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థించుకున్నారు. పేదవాడిని దృష్టిలో పెట్టుకునే తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. రూ. 6 బాటిల్​​ను రూ. 200 లకు అమ్మటాన్ని భాజపా ప్రోత్సహించదని వ్యాఖ్యనించారు. పేదల కోసం చీప్ లిక్కర్​ను రూ. 50 కే అమ్మాలని డిమాండ్ చేశారు. రూ. 50కి చీప్ లిక్కర్ అమ్మితే కుటుంబానికి ఏడాదికి రూ. 2 లక్షలు మిగులుతాయన్నారు. తనను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో తనకు తెలుసునని ఎద్దేవా చేశారు.

గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చాల్సిందేనని సోము డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక.. జిన్నా టవర్ పేరు మారుస్తామన్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి పేరును కూడా మార్చాలన్నారు.

వైరల్​గా మారిన సోమూ వ్యాఖ్యలు..

విజయవాడలో ఈనెల 28న జరిగిన భాజపా ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను కోటి ఓట్లతో గెలిపిస్తే.. లిక్కర్​ను రూ. 70 కే విక్రయిస్తామని ప్రకటించారు. రాష్ట్ర రెవెన్యూ మెరుగ్గా ఉంటే రూ. 50 కే విక్రయిస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోము వీర్రాజు వ్యాఖ్యలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఇదీ చదవండి

BJP Leaders ON CM Jagan: భాజపా అధికారంలోకి వస్తేనే ఏపీ సర్వతోముఖాభివృద్ధి: సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.