తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ చిత్రాలు వేశారు. వైరస్ నియంత్రణకు ప్రజలంతా అధికారులకు సహకరించాలని కోరారు. శ్యామ్ జాదుగర్ కుటుంబ సభ్యులు ఈ చిత్రాలను గీశారు. మీరు బయటకు వస్తే నేను మీ ఇంటికి వస్తా అంటూ కరోనా బొమ్మ వేశారు. దాని కింద వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది మీడియా సేవలకు సంబంధించి గుర్తులను వేశారు. మా శ్రమ వృధా కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని రాశారు. చిత్రాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి అని అధికారులు ప్రశంసించారు.
ఇదీ చదవండి: