కరోనా వైరస్ నివారణ కోసం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో.. డ్రోన్ల సాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్వీయ పరిశీలనలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
డ్రోన్ ద్వారా ఇప్పటివరకు వ్యవసాయ, ఆక్వా రంగాల్లో మందులు, ఎరువులు పిచికారీ చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. వైరస్ నివారణకు ఇప్పుడు ప్రయోగాత్మకంగా.. సోడియం హైపోక్లోరైడ్ ఉపయోగించామని తెలిపారు.
ఇదీ చదవండి: