గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకునే కాటన్ దొర.. సర్ ఆర్దర్ కాటన్ జయంతిని కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. రావులపాలెంలోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, గ్రామస్తులు కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి పంట కాల్వలు తవ్వించి... ప్రజలకు ఎంతో ఉపయోగ పడేలా చేసిన ఆ మహనీయుడి సేవలు మరువలేనివని కొనియాడారు.
ఇదీ చదవండి: