ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని.. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తెలిపారు. వేములకొండలో గిరిజన రైతులకు హక్కుల గుర్తింపు చట్టాన్ని అనుసరించి.. రెండవ విడతగా పట్టాలను ఆమె పంపిణీ చేశారు. మండలంలో సుమారు 3,000 మందికి ఆర్వోఎఫ్ఆర్ కొండపోడు భూములకు పట్టాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. 1,199 మంది గిరిజనులకు పట్టాలు పంచి పెట్టారు.
ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఇంటికీ పైపులైను వేసి, తాగునీరు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రంపచోడవరానికి 50 కోట్ల రూపాయలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేశామని వెల్లడించారు. గిరిజనులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం'