తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కోరుకొండ మండలాల్లోని నాటుసారా స్థావరాలపై ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 18 వందల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని కోరుకొండ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: హోటళ్లలో కొవిడ్ వైద్యం నిర్వహణపై వామపక్షాల నిరసన