కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా(East Godavari district) ఆత్రేయపురం మండలం వాడపల్లి ఆలయ బ్రహ్మోత్సవాల్లో అద్భుత చిత్రం కనువిందు చేసింది. పులిహోర, గారెలు, పువ్వులతో గీసిన వెంకటేశ్వర స్వామి చిత్రం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. స్వామి వారి తిరుప్పావడ సేవ కార్యక్రమాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. అనంతరం పులిహోరను స్వామి ఆకారంలో నేలపై వేసి.. చుట్టూ గారెలు, మిరపకాయలు, పండ్లు, పువ్వులతో అందంగా అలంకరించారు. ఈ విభిన్న కళాకృతిని భక్తులు ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చదవండి