ETV Bharat / state

ఎల్‌ఈడీ తెరలు.. డిజిటల్ లావాదేవీలు.. గోదావరి జిల్లాలో ఈ సారి టెక్ కోడి పందాలు - ఏపీ ప్రధాన వార్తలు

COCK FIGHT: ఈ సారి సంక్రాంతి పండుగకు ఆధునీకతను మేళవిస్తున్నారు నిర్వాహకులు. ఎప్పటి మాదిరే కోడి పందేలు జరిగితే ఏం బాగుంటుందనుకుంటున్నారో.. ఈ సారి డిజిటల్ లావావేవీలకు చోటిస్తున్నారు. అంతే కాదండోయ్.. పందాలను చూసేందుకు, భారీ స్థాయిలో ఎల్​ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతలా ఏర్పాటు చేస్తే.. బహిరంగం అయిపోదూ! అని అనుకుంటున్నారా..! అబ్బే అలాంటిది ఏమి కాదన్న దీమాతోనే ఏర్పాటు చేస్తున్నామంటున్నారు నిర్వాహకులు. ఆ ఏర్పాట్లేంటో మీరు చూడండి.

kodi pandem
kodi pandem
author img

By

Published : Jan 13, 2023, 10:03 AM IST

COCK FIGHT: కోడి పందేల నిర్వహణలో ముందుండే ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గన్నవరం నియోజకవర్గంలోని అంపాపురంలో కోడి పందాలకు మొత్తం నాలుగు బరులను సిద్ధం చేశారు. ఈసారి పందెంరాయుళ్లను మూడు కేటగిరీలుగా విభజిస్తున్నట్లు తెలిసింది. ప్రవేశ రుసుమును బట్టి వసతులు కల్పించనున్నారు. పందాలు జరిగేటప్పుడు నగదు నేరుగానే కాకుండా డిజిటల్ లావాదేవీలు జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందరికీ పందేలు కనపడేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు . ఈ ప్రాంగణానికి కొద్ది దూరంలో వాలీబాల్, కబడ్డీ లాంటి ఆటలను నిర్వహిస్తున్నారు.

150 కోట్ల రూపాయలు చేతులు మారుతాయని: కోడి పందేలకు పెద్దపీట వేసే పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. తణుకు పరిసరాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పందాలు చూడ్డానికి వచ్చేవారి కోసం షామియానాలు ఏర్పాట్లు చేస్తున్నారు. కోడి పందాలు జరిగే రోజుల్లో ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 150 కోట్ల రూపాయలు చేతులు మారుతాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పందేలు జరిగే ప్రదేశాలకు దగ్గర్లోని లాడ్జిల్లో ఇప్పటికే బుకింగ్‌లు పూర్తి అయ్యాయి.

పోలీసుల విశ్వప్రయత్నాలు: ఒకపక్క పందెంరాయుళ్లు సిద్ధమవుతుంటే వారిని నియంత్రించడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కోడికత్తులను ముందే స్వాధీనం చేసుకున్నారు. పందెంరాయుళ్లు ఏర్పాటు చేసుకున్న కోడిపందెం బరులను రెడ్డిగూడెం పోలీసులు ధ్వంసం చేశారు. కోడిపందాలు నిర్వహించేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంక్రాంతికి కాలు దువ్వుతున్న కోళ్లు..కత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.