తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పంచాయతీ కార్మికులు చేపట్టిన ఆందోళన 15వ రోజుకు చేరింది. ఈ సంద్భంగా యూనియన్ అధ్యక్షుడు మాతా గాంధీ, పిల్లి రాజశేఖర్ మాట్లాడుతూ... పెరిగిన ధరలను బట్టి తమ కుటుంబ పోషణకి జీతాల పెంపుదలను అమలు చేయాలని కోరారు. ప్రజల ఆరోగ్యం కోసం, మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం తాము చేస్తున్న శ్రమను గుర్తించాలన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమ న్యాయమైన డిమాండ్లను ఈ నెలాఖరులోగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. లేని పక్షంలో నవంబర్ 1 నుంచి సమ్మె చేయక తప్పదన్నారు. ధర్నా అనంతరం ఈఓపీఆర్, ఆర్డీ భాస్కర్రావు సమక్షంలో చర్చలు జరిపారు. జీతాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 శాతం మించకూడదని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి ఆదాయాన్ని తక్కువగా చూపించి జీతాలు పెరగకుండా అడ్డు పడుతున్నారని కార్మికులు భాస్కరరావుతో వాపోయారు. గడిచిన 3 సంవత్సరాల వార్షిక నివేదిక ల ఆధారంగా జమా ఖర్చులు బేరీజు వేసి నిర్ణయం తీసుకోవాలని, శనివారం మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి