ETV Bharat / state

ఇసుక తవ్వకాలను అడ్డగించిన గ్రామస్తులు! - తూర్పుగోదావరిలో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు

ఇసుక తవ్వకాలు.. గ్రామస్తుల ఆగ్రహానికి కారణమైంది. చెప్పింది ఒకటైతే.. మరోటి చేస్తారా అని గ్రామస్తులు నిలదీసే పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఏమైంది? ఎక్కడ జరిగింది?

Sand excavation contrary to regulations at p. gannavaram in east godavari

author img

By

Published : Apr 26, 2020, 3:03 PM IST

Updated : Apr 26, 2020, 4:49 PM IST

ఇసుక తవ్వకాలను అడ్డగించిన గ్రామస్తులు!

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని కందాలపాలెం వద్ద... గోదావరి నది పాయను ఆనుకొని ఉన్న పెరుగులంక భూమిలో ఒక మీటరు లోతున మట్టిని తీసేందుకు ప్రభుత్వం రైతులను ఒప్పించింది. ఒక జాతీయ రహదారి అభివృద్ధి పనుల కోసం మట్టి కావాలని చెప్పగా సదుద్దేశంతో రైతులు అంగీకరించారు. గత 15 రోజులుగా మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి.

అయితే.. ఒక మీటరు లోతున కాకుండా నాలుగు మీటర్ల లోతులో మట్టి తవ్వకాలు చేపడుతున్నారని తెలిసి.. ఆగ్రహించిన రైతులు.. లారీలను అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న ఈ తవ్వకాలు వల్ల తమ భూములు గోదావరిలో కలిసి పోతాయని రైతులు ఆవేదన చెందారు. వెంటనే ఇక్కడ మట్టి తవ్వకాలు ఆపేయాలంటూ... లారీలను అడ్డుకొని వెనక్కి పంపేశారు.

ఇదీ చదవండి:

కోలుకున్నా గానీ కళ్లల్లోనే కరోనా తిష్ఠ!

Last Updated : Apr 26, 2020, 4:49 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.