కాకినాడలో ముగ్గురు యువకుల హిజ్రాలను కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేశారు. హిజ్రాల ఫిర్యాదు మేరకు కాకినాడ నగర పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులపై ఇప్పటికే రౌడీషీట్ ఉన్నట్లు డీఎస్పీ రవివర్మ తెలిపారు. అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి