తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామస్థులు గ్రామ ప్రధాన రహదారిపై వరి నాట్లు వేశారు. రహదారులు ధ్వంసం అయినా.. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు అంటున్నారు. వర్షాలకు రోడ్డు మరింతగా బురదమయం కావడంతో రోడ్డు పై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
ఇదీ చదవండి: మూడు రాజధానుల కేసులపై ఇకపై రోజువారీ విచారణ!