తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ సేవ గురువారం పునఃప్రారంభమైంది. సహస్ర దీపాల మధ్య ఊయలలో సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను ఆశీనులను చేసి అర్చకులు, పండితులు, పురోహితుల బృందం ఆధ్వర్యంలో సేవ ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత సేవను దేవస్థానంలో మొదటిసారి ప్రారంభించారు.
కొవిడ్ తర్వాత ఈ సేవను కొనసాగించడంపై వైదిక కమిటీ, అధికారుల మధ్య భిన్న వాదనల నేపథ్యంలో... ఈనాడు, ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి ఈవో త్రినాథరావు స్పందించారు. ఆలయ అధికారులు, వైదిక కమిటీతో చర్చించి వెంటనే సేవను ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో తూర్పురాజగోపురం వద్ద మందిరంలో సాయంత్రం 6 గంటలకు సేవను ప్రారంభించారు. మందిరంలో చుట్టూ అలంకరించిన 1,058 దీపాలను వెలిగించి స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. ఇకమీదట నిత్యం సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: