ETV Bharat / state

ఊపిరి పీల్చుకుంటున్న ముంపు గ్రామాల ప్రజలు

వరదలతో పరవళ్లు తొక్కిన గోదారమ్మ శాంతించింది. భద్రాచలం, ధవళేశ్వరంల వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుతోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.

Reduced Godavari flood
తగ్గిన గోదారి వరద
author img

By

Published : Aug 19, 2020, 2:11 PM IST

గత వారం రోజులుగా ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి ప్రస్తుతం శాంతించింది. తెలంగాణలోని భద్రాచలం, ఏపీలోని ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 9గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం 46.6 అడుగులకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 11.3లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. నీటి మట్టం తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఉపసంహరించుకున్నారు. మరోవైపు భద్రాచలం పరిసర ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు క్రమంగా తగ్గుతోంది. ఏజెన్సీ మండలాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాలకు ఇంకా రాకపోకలు కొనసాగడంలేదు. కూనవరం, చింతూరు, కుక్కునూరు మండలాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

  • ధవళేశ్వరం వద్ద ..

మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద కూడా గోదావరిలో వరద ఉద్ధృతి తగ్గుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 18.60 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ నుంచి 19.78 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ముంపు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈరోజు సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వమే ముద్దాయి: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.