ETV Bharat / state

కొవిడ్ క్రిటికల్ కేర్ ఆసుపత్రిగా... రాజమహేంద్రవరంలోని ఈఎస్​ఐ వైద్యశాల - కొవిడ్ క్రిటికల్ కేర్ ఆసుపత్రిగా రాజమహేంద్రవరంలోని ఈఎస్​ఐ వైద్యశాల

వంద పడకలతో కూడిన కొవిడ్ క్రిటికల్ కేర్ ఆసుపత్రిని.. మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ భరత్, కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఈఎస్​ఐ వైద్యశాలను కొవిడ్ ఆసుపత్రిగా మార్చారు.

rajamahendravaram esi hospital
రాజమహేంద్రవరంలోని ఈఎస్​ఐ వైద్యశాల
author img

By

Published : May 19, 2021, 6:44 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో మరో ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రి అందుబాటలోకి వచ్చింది. రాజమహేంద్రవరంలోని ఈఎస్​ఐ వైద్యశాలను.. 100 పడకలతో కొవిడ్ క్రిటికల్ కేర్ ఆసుపత్రిగా మార్చారు. మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ భరత్, కలెక్టర్ మురళీధర్ రెడ్డి దీనిని ప్రారంభించారు. స్థానిక పేపర్ మిల్లు నుంచి 15 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పైపులైన్​ను ఆసుపత్రికి అనుసంధానించారు.

ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలో అంటువ్యాధుల జాబితాలోకి 'బ్లాక్​ ఫంగస్'!​

దేశంలోనే అత్యధిక కొవిడ్ కేసులు నమోదవుతున్న పదో జిల్లాగా తూర్పు గోదావరి ఉందని మంత్రి తెలిపారు. కరోనా కట్టడికి ప్రజలందరూ సహకారించాలని కోరారు. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టేందుకు.. రోగుల రూపంలో వెళ్లి నిఘా ఆపరేషన్​లు సైతం చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ఇప్పటికే పలు ప్రైవేటు వైద్యశాలలకు రూ. కోటి 54 లక్షల జరినానాలు విధించామన్నారు. ఉభయగోదావరి జిల్లాల కొవిడ్ రోగులకు ఈఎస్​ఐ ఆసుపత్రి వరంగా మారనుందని ఎంపీ భరత్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: అందిన 'కాటి'కి దోచేస్తున్నారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.