ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: ప్రైవేటు విద్యాసంస్థలు.. మనుగడ ప్రశ్నార్థకం

పోటీ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ప్రైవేటు విద్యాసంస్థలపై కరోనా ప్రభావం ఎక్కువగానే పడింది. విద్యా సంవత్సరం మొదలుపై అనిశ్చితి, ప్రవేశాలపై సందేహాలతో విద్యాసంస్థలు ఆందోళన చెందుతున్నాయి. అద్దె భవనాల్లో సంస్థలు నడిపేవాళ్లు ఆర్థికభారంతో సతమతవుతున్నారు. విద్యార్థుల భవితపై తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు.

author img

By

Published : Jul 20, 2020, 3:44 PM IST

కరోనా ఎఫెక్ట్ : ప్రైవేటు విద్యాసంస్థలు... మనుగడ ప్రశ్నార్థకం

ప్రైవేటు విద్యాసంస్థలపై కరోనా ప్రభావం చాలా ఎక్కువగానే పడిందని చెప్పాలి. జూన్ మొదటి వారం నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరం సందడి ఈ ఏడాది సెప్టెంబర్ మొదటివారానికి మారింది. ఈ విషయంపై విద్యాసంస్థలు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. తరగతిలో విద్యార్థుల సంఖ్య 80 నుంచి 40కి తగ్గించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బోధనా సిబ్బందిని నియమించుకోవడం ప్రైవేటు విద్యాసంస్థలపై ఆర్థిక భారం పడనుంది. గడిచిన నాలుగు నెలలుగా ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు.

మనుగడ ప్రశ్నార్థకం

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రవేశాలు ఏ విధంగా ఉంటాయనేది సందేహంగానే ఉందని నిర్వహకులు అంటున్నారు. అద్దె భవనాల్లో విద్యాసంస్థలు నిర్వహిస్తున్న వారి పరిస్థితి మరింత ఘోరంగా ఉందంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదంటున్నారు. ఈ సమస్యను ఏ విధంగా అధిగమించాలో తోచని స్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులు కట్టే ఫీజులు పైనే ఆధారపడి నిర్వహిస్తున్న విద్యాసంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనలో తల్లిదండ్రులు

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో 2 ప్రభుత్వ, 5 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో సుమారు 300 విద్యార్థులు ఉండగా.. ప్రైవేటు కళాశాలల్లో సుమారు 2 వేల నుంచి 3 వేల వరకు విద్యార్థులు చదువుతున్నారు. నియోజవర్గంలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత యానాంలోనూ ఒక ప్రభుత్వ.. రెండు ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 3300 మంది విద్యార్థులు చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉండడంతో.. మధ్యతరగతి ప్రజలు...భారమైనా సరే తమ పిల్లల్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిస్తున్నారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో అర్థంకాక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి : తెలంగాణ: పవిత్రమైన పునుగుపిల్లిని చంపి తినేశారు.. చివరికి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.