తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలోనూ కరోనా విజృంభిస్తోంది. ఖైదీలకు వేగంగా వైరస్ సోకుతోంది. కరోనా పాజిటీవ్ ఉన్న ఖైదీ గతరాత్రి గుండెపోటుతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. అక్కడ సుమారు 1700 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 900 మందికి పరీక్షలు చేశారు. ఇప్పటివరకూ 50మందికి పైగానే ఖైదీలకు కరోనా సోకింది. సిబ్బందికి కూడా అధిక సంఖ్యలో పాజిటీవ్ నిర్ధరణ అయింది. ఇంకా పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత కేంద్ర కారాగారంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దీంతో జైలులో అధికారులు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి. 'రామమందిర భూమిపూజ ఎస్వీబీసీ ఎందుకు ప్రసారం చేయలేదు'