తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలయ్యాయి .చిన్నారులు గొబ్బెమ్మలకు పూజలు చేసి... సంక్రాంతి పాటలతో సందడి చేశారు. పెద్దవారు పిల్లలని చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. భోగి పళ్లు, గొబ్బెమ్మలతో కోనసీమలోని పల్లె ప్రాంతాలు ముందుగానే పండగ సందడి సంతరించుకున్నాయి.
జిల్లాలోని గోకవరం ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయం వద్ద చిన్నారులు గోదాదేవి, హరిదాసు వేషధారణలతో సందడి చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులు గొబ్బిళ్ల పూజలు నిర్వహించారు. సంక్రాంతి విశిష్టత, సాంప్రదాయాలను... భావితరాలకు అందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మహిళలు తెలిపారు.
ఇదీ చూడండి: