ETV Bharat / state

బోటు ప్రమాదంలో లభ్యమైన 8 మృతదేహాలకు పోస్టుమార్టం - rjy

బోటు ప్రమాదంలో లభ్యమైన ఎనిమిది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తికాగా, ఆరు మృతదేహాలను గుర్తించారు. మరో రెండిటికి జన్యు పరీక్షలు చేసి చెబుతామని వైద్యులు తెలిపారు

బోటు ప్రమాదంలో లభ్యమైన 8 మృతదేహాలకు పోస్టుమార్టం
author img

By

Published : Oct 24, 2019, 5:28 AM IST

పాపికొండల విహారయాత్రకు వెళ్తూ మునిగిన బోటును బయటకు తీయడంతో లభించిన 8 మృతదేహాలకు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం ఉదయం 10 గంటల కల్లా ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో వైద్యులు సాయంత్రం 4 గంటల కల్లా పోస్టుమార్టం ప్రక్రియను పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. ఆసుపత్రిలో ఎటుచూసినా రోదనాభరిత వాతావరణం కనిపించింది.

మృతదేహాల గుర్తింపులో గందరగోళం:

మృతదేహాల్లో అయిదింటిని గుర్తించగలిగినా మరో మృతదేహం విషయంలో వివాదం నెలకొంది. ఆ మృతదేహానికి మొలతాడు, జీన్స్‌ప్యాంటును బట్టి నల్గొండ జిల్లా హలియా గ్రామానికి చెందిన సురభి రవీంద్ర బంధువులు ధ్రువీకరించారు. అయితే మృతదేహం తమదని గల్లంతైన కొండా రాజశేఖర్‌ బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో గందరగోళం ఏర్పడింది. జన్యుపరీక్షలు ద్వారా నిర్ధారించడం కోసం నమూనాలను సేకరించి కాకినాడకు పంపుతున్నట్లు సూపరింటెండెంట్‌ రమేష్‌ కిశోర్‌ తెలిపారు. మరో మృతదేహం సగం మాత్రమే ఉండటం, పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా ఉంది. మరో మృతదేహానికి సంబంధించి పుర్రె మాత్రమే దొరకింది. వాటిని నిర్ధారించాల్సి ఉందని సూపరింటెండెంట్‌ తెలిపారు.

వైద్యుల చొరవతో..:

పోస్టుమార్టం సమయంలో మృతదేహాల నుంచి భరించలేని దుర్వాసన వస్తున్నా వైద్యులు, పోలీసులు ఓపిగ్గా వ్యవహరించడంతో మృతులను గుర్తించగలిగారు. పూర్తిగా మాంసం ముద్దలుగా మారిన వాటికి పోస్టుమార్టం క్షుణ్నంగా చేశారు. లభించిన వస్తువులు, మృతదేహాలను అణువణువూ పరిశీలించి వంటిపై మొలతాడు, ఇతర గుర్తులు ఏ చిన్న ఆధారాన్ని వదిలిపెట్టకుండా నమోదు చేసుకున్నారు.

ఆ రెండు మృతదేహాలు ఎవరివి?
లభించిన వారిలో ఓ చిన్నారి మృతదేహం, మరో వ్యక్తి మృతదేహాన్ని గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. వంటిపై దుస్తులు కూడా లేకపోవడం పూర్తిగా శరీర అవయవాలు చేపలు తినేశాయి. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రమేష్‌ కిశోర్‌ తెలిపారు.

బోటు ప్రమాదంలో లభ్యమైన 8 మృతదేహాలకు పోస్టుమార్టం

ఇవీ చదవండి

బోటు ప్రమాదంలో మృతదేహాల గుర్తింపు

Intro:ap_vja_50_23_jaikisan_mumpulo_varipolalu_pkg_avb_ap10044
కోసుర కృష్ణమూర్తి అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511

కృష్ణాజిల్లా, కోడూరు మండలంలో వర్షం నీటి ముంపులో వరిపోలాలు జైకిసాన్ కోసం స్టోరీ

Body:కృష్ణాజిల్లా, కోడూరు మండలంలో వర్షం నీటి ముంపులో వరిపోలాలు జైకిసాన్ కోసం స్టోరీ

Conclusion:కృష్ణాజిల్లా, కోడూరు మండలంలో వర్షం నీటి ముంపులో వరిపోలాలు జైకిసాన్ కోసం స్టోరీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.