తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో పిల్లంక పంచాయతీకి చెందిన సుమారు ఐదు వందల కుటుంబాలు ముమ్మిడివరంలోని లంక గ్రామాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ 285 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కొందరు ద్విచక్ర వాహనాలపై పోలింగ్ కేంద్రాలకు చేరుకోగా... మరికొందరు ఆటోలలో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. గతంలో పడవలో వెళ్లేవారని ప్రస్తుతం వారధి అందుబాటులో రావటంతో వాహనాలపై వెళ్తున్నామని లంక గ్రామాల ప్రజలు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతంపై.. కేంద్ర హోం శాఖకు తెదేపా ఫిర్యాదు
ఓటు వేయాలంటే 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే... - తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రెవెన్యూ డివిజన్ తాళ్ళరేవు మండలం పరిధిలో 16 పంచాయతీలకు, 198 వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గోదావరి తీరం ముమ్మిడి వరం మండలంలోని లంక గ్రామాల ప్రజలు 25 కిలోమీటర్లు ప్రయాణించి ఓటు హక్కుని వినియోగించుకున్నారు.