తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో రాష్ట్ర స్ఠాయి ఎడ్లబండ్ల పోటీలు ప్రారంభమయ్యాయి... వివిధ జిల్లాలకు చెందిన 52 ఎడ్లబండ్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. భారీ సంఖ్యలో జనాలు ఒకేచోట గుమ్మికూడటంతో కరోనా దృష్ట్యా స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ జరిగింది...
అంతకు ముందు రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలను పోలీసులు అడ్డుకున్నారు. పోలవరం కాల్వగట్టుపై.. నిర్వాహకులు పోటీలు నిర్వహించడం ప్రమాదకరమని.. అందుకే నిలిపివేశామని పోలీసులు తెలిపారు. దీంతో.. నిర్వాహకులు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌ను కలిశారు. పోటీల నిలిపివేతపై డీఎస్పీతో.. ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడగా తిరిగి పోటీలను ప్రారంభించారు. ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన పోటీలు.. పోలీసులు అడ్డుకున్న కారణంగా.. 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ జోక్యం చేసుకుని పోటీలను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: