ETV Bharat / state

బోటు ప్రమాదం.. దేవీపట్నం వద్ద దుబాసీల అడ్డగింత - గోదావరిలో బోటు ప్రమాదం

గోదావరిలో మునిగిన బోటును వెలికి తీసేందుకు విశాఖ నుంచి దేవీపట్నం వచ్చిన దుబాసీల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడినుంచి కచ్చులూరు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు.

ధర్మాడి సత్యం
author img

By

Published : Oct 20, 2019, 9:24 AM IST

దేవీపట్నం వద్ద వేచి ఉన్న దుబాసీలు

గోదావరిలో మునిగిన బోటు వెలికితీత కోసం దుబాసీల బృందం విశాఖ నుంచి దేవీపట్నం చేరుకుంది. కానీ అక్కడినుంచి కచ్చులూరు వెళ్లేందుకు వారిని పోలీసులు అనుమతించలేదు. దీంతో ధర్మాడి సత్యం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కచ్చులూరు వెళ్లేందుకు బోటు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమకు సహకరిస్తే బోటు వెలికితీత పనులు చేపడతామని, బోటుకు లంగర్లు తగిలించి వెలికితీస్తామని దుబాసీలు చెబుతున్నారు.

ఎవరీ దుబాసీలు
కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును ఒడ్డుకు చేర్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. బోటు లంగరుకు చిక్కినట్లే చిక్కి పట్టు తప్పుతోంది. నీటిలో ఇసుక మేటలు, మట్టిదిబ్బలు ఉండటంతో వెలికితీత పనులకు ఆటంకం కలుగుతోందని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది. నది లోపలకు వెళ్లి బోటుకు కొక్కేలు బిగిస్తే బోటు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో ఈ మేరకు విశాఖ నుంచి దుబాసీల బృందాన్ని దేవీపట్నం తీసుకువచ్చింది. వీరు నదిలోకి వెళ్లి బోటుకు కొక్కేలు తగిలిస్తారు.

Intro:Body:

AP TAAZA

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.