police registered cases on the Anaparthi incident: ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నేతలపై పోలీసుల కేసుల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో... చోటుచేసుకున్న ఘటనలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చంద్రబాబు, మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చినరాజప్ప, కొండబాబు, స్వామినాయుడు, జ్యోతుల నవీన్ సహా పలువురు ముఖ్య నేతలపై అనపర్తి, బిక్కవోలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు.
వెయ్యి మంది టీడీపీ శ్రేణులపై: అనపర్తి ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా వెయ్యి మంది టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న చంద్రబాబు అనపర్తి పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించిన విషయం తెలిసిందే. అడ్డంకులను అధిగమించి దాదాపు ఏడు కిలోమిటర్ల పైగా చీకట్లోనే కాలినడకన చంద్రబాబు అనపర్తికి చేరుకుని, అక్కడ ముందుగా నిర్ణయించుకున్న దేవిచౌక్ సెంటర్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. చంద్రబాబు పాదయాత్ర సమయంలోను పోలీసులు అడ్డుకునే యత్నం చేయడంతో, తెలుగుదేశం శ్రేణులకు ఖాకీలకు మధ్య తీవ్రఘర్షణ చోటుచేసుకుని తోపులాట ,లాఠీ ఛార్జీలకు దారీతీసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మూడు ఎఫ్ఐఆర్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఏ1 గా చంద్రబాబుపై: బిక్కవోలు పీఎస్ పరిధిలో చంద్రబాబు ఏ1గా ఏ2 గా నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి , జవహర్ ఏ3 గా కేసు పెట్టారు. ఏ4 గా స్వామి నాయుడు, ఏ5 గా చినరాజప్ప, ఏ6 మాజీ ఎమ్మెల్యే కొండబాబు, ఏ7 గా జ్యోతుల నవీన్, ఏ8, ఏ9 గా మాజీ ఎమ్మెల్యే లు అయితా బత్తుల ఆనందరావు, గొల్లపల్లి సూర్యారావు లపై కేసుల నమోదు అయ్యాయి. డీఎస్పీ ఆధారంగా 143, 353, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయి. ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, జవహర్ సహా పలువురు తెలుగుదేశం నేతలపై 143, 353, 332, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరో ఎఫ్ఐఆర్ లో 188, 506, 34 సెక్షన్ల కింద తెలుగుదేశం శ్రేణులపై కేసులు నమోదు అయ్యాయి.
ఇవీ చదవండి: