ETV Bharat / state

విధులకు ఆటంకం కలిగించారంటూ.. తెదేపా నేతలపై కేసు నమోదు - రావులపాలెం పోలీసులు తాజా వార్తలు

కరోనా కాలంలో గుంపులుగా రావడం, విధులకు ఆటంకం కలిగించడం వంటి కారణాలపై తెదేపా నేతలపై రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీలను వదిలిపెట్టారంటూ స్టేషన్​ ఎదుట తెదేపా నేతలు నిరసన తెలిపారు. వీరిలో పదిమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

police registered case on telugudesham party leaders
తెదేపా నేతలపై కేసు నమోదు
author img

By

Published : Jun 17, 2020, 2:01 PM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని పది మంది తెదేపా నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇళ్ల స్థలాలు మెరక చేసేందుకు బొండు మట్టిని తరలిస్తున్న సమయంలో లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నరంటూ పోలీసులకు పట్టించారు. అయితే వాహనాలకు అనుమతులున్న కారణంగా కేసు నమోదు చెయ్యకుండా లారీలను విడిచిపెట్టారు. ఈ విషయమై తెదేపా నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా స్టేషన్​ ఎదుట నిరసన చేపట్టారు. అయితే కరోనా కాలంలో గుంపులుగా స్టేషన్​కు రావడం, వారి విధులకు ఆటంకం కలిగించడంపై కేసు నమోదు చేశారు. పది మంది తెదేపా నేతలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇవీ చూడండి...: ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.