తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. సెర్చ్ వారెంట్ తీసుకొని వెళ్లి తనిఖీలు నిర్వహించగా... లాడ్జ్ మేనేజర్‌తో పాటు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.71,390 నగదు స్వాధీనం చేసుకున్నారు. లాడ్జ్ యజమానికి ఈ పేకాట శిబిరంతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి త్వరలోనే అతనిని అదుపులోకి తీసుకుంటామని రెండవ పట్టణ సీఐ పి. ఈశ్వరుడు తెలిపారు. ఓ రాజకీయ వర్గానికి చెందినవారు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి. గ్రామ పంచాయతీల్లో వెలుగుచూస్తున్న కార్యదర్శుల అవినీతి..!