కాకినాడలో దొంగ అరెస్ట్.. రూ.10 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం - కాకినాడలో దొంగ అరెస్ట్
ఇళ్లల్లోకి చొరబడి బంగారు ఆభరణాలు అపహరించే దొంగను తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ఎల్లమిల్లి వెంకటరమణ అనే వ్యక్తి అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఇళ్లల్లో మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లేవాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి నిందితుణ్ని చాకచక్యంగా పట్టుకున్నారు. వెంకటరమణ నుంచి రూ.10 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ నయీం అస్మీ తెలిపారు.
బంగారు అభరణాలను చూపిస్తున్న పోలీసులు