ETV Bharat / state

వ్యసనాలకు బానిసై బైకుల చోరీ.. పోలీసుల అదుపులో నిందితుడు - రాజోలులో బైక్​ల చోరీ వార్తలు

ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని రాజోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వ్యసనాలకు బానిసై.. డబ్బు కోసం ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. వాటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడన్నారు.

police arrest the thief in east godavari district
దొంగను పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Apr 1, 2021, 11:07 AM IST

వ్యసనాలకు బానిసగా మారి.. ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తూర్పగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవుకు చెందిన నల్లి బాలకృష్ణ అలియాస్‌ బాలు మలికిపురం మండలం కత్తిమండలో అత్తగారింట్లో ఉంటున్నాడు. నిందితుడు వ్యసనాలకు లోనై అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ తాళాలు ఉపయోగించి పాత ద్విచక్ర వాహనాలను దొంగిలించడం మొదలుపెట్టాడు. ఇలా కోనసీమ పరిధిలో 27 వాహనాలను దొంగిలించాడు. వీటిలో 12 వాహనాలను పలువురి వద్ద తాకట్టు పెట్టాడు. మరో 15 కత్తిమండలో ఓ ఖాళీ స్థలంలో నిలిపి, వాటిపై బరకం కప్పి ఉంచాడు.

మామిడికుదురు మండలం మగటపల్లికి చెందిన కలిగితి ప్రశాంత్‌కుమార్‌ ఈనెల 18న తాటిపాకకు వెళ్లగా అక్కడ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. దీనిపై రాజోలు పోలీస్‌ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడి పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందిచారు.

ఇదీ చదవండి

అక్రమంగా తరలిస్తున్న 600 కిలోల గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.