ETV Bharat / state

పట్టణం విస్తరిస్తున్నా.. సౌకర్యాలు అంతంత మాత్రమే - pittapuram problems

స్వాతంత్య్రం వచ్చేదాకా మహారాజులు ఏలిన ప్రాంతం...! ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ప్రదేశం...! పట్టణం విస్తరిస్తోంది... జనాభా పెరుగుతోంది. మౌలిక వసతులు మాత్రం ఇంకా అనాది కాలంలోనే ఉండిపోయాయి. ఇప్పటికి 12సార్లు పురపాలక ఎన్నికలు జరిగాయి. ఎవరొచ్చినా సరే అభివృద్ధి మాత్రం అందని ద్రాక్షే..! 13వసారి పీఠాన్ని అధిరోహించే వారైనా తమ సమస్యలకు దారి చూపుతారన్నది పిఠాపురం వాసుల ఆశ.

pithapuram municipal elections
పట్టణం విస్తరిస్తున్నా.. సౌకర్యాలు అంతంత మాత్రమే
author img

By

Published : Mar 3, 2021, 1:58 PM IST

పట్టణం విస్తరిస్తున్నా.. సౌకర్యాలు అంతంత మాత్రమే

ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాచుర్యం పొందిన నాటి పీఠికాపురమే నేటి పిఠాపురం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురూహుతికా అమ్మవారు కొలువైన ఈ ప్రాంతాన్ని ఆ దేవి పేరుతోనే పిలిచేవారు. పట్టణంలోని శ్రీపాద వల్లభుని దర్శనానికి పొరుగురాష్ట్రాల నుంచి నిత్యం భక్తులు వస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న పట్టణంలో.. మౌలిక సదుపాయాలంటే.. అద్భుతంగా ఉంటాయనుకోవడం సహజం. కానీ కనీస సౌకర్యాలకూ పిఠాపురం ప్రజలు నోచుకోలేకపోతున్నారు.

1957 అక్టోబర్‌లో నగర పంచాయతీగా, 1980 ఏప్రిల్‌లో ద్వితీయ శ్రేణి పురపాలక సంఘంగా ఆవిర్భవించింది. తొలుత 10 వార్డులున్న ఈ పట్టణంలో ప్రస్తుతం 30 వార్డులున్నాయి. ఇప్పటికి 12సార్లు ఎన్నికలు జరగ్గా.. ఐదు సార్లు పురుషులు చైర్మన్​ పీఠం అధిష్టించారు. ఇందులో దామెర వెంకట కృష్ణ సూర్యారావు నాలుగు పర్యాయాలు ఛైర్మన్​గా ఉన్నారు. ఇక మూడు సార్లు మహిళలు ఛైర్​పర్సన్​లుగా పని చేశారు. 13వ సారి జరగనున్న ఈ దఫా ఎన్నికల్లో.. ఛైర్‌పర్సన్‌ పదవిని మహిళకు కేటాయించారు.

164 కిలోమీటర్ల మేర రహదారులు, 190 కిలోమీటర్ల మేర మురుగునీటి వ్యవస్థ ఉంది. పట్టణం విస్తరిస్తున్నా..... సమస్యల పరిష్కారానికి మాత్రం అడుగు పడట్లేదు. 40 ఏళ్లనాడు వేసిన తాగునీటి పైప్‌లైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోంది. ఇలా స్థానికులను కలవరపెడుతున్న సమస్యలెన్నో ఉన్నాయి. పిఠాపురంలో పాగా వేసేందుకు వైకాపా, తెలుగుదేశం, జనసేన-భాజపా కూటమి అభ్యర్థులను బరిలో దింపి వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి.

ఇదీ చదవండి: మున్సిపోల్స్: నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.