ETV Bharat / state

శ్మశానం విషయంలో 2 వర్గాల మధ్య గొడవ

author img

By

Published : May 19, 2020, 7:48 AM IST

తూర్పు గోదావరి జిల్లా రంగంపేట శ్మశానం విషయంలో రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ.. ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ వర్గానికి సంబంధించిన వారి శ్మశాన స్థలాన్ని... ఇళ్ల స్థలాలకు కేటాయించటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

people protest  about  Cemetery  place  in east godavari dst

శ్మశానంలో ఇళ్ల స్థలాలు కేటాయించి... తమకంటూ శ్మశానం లేకుండా చేశారంటూ.. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం బాలవరంలో ఓ వర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీకి రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామశివారు బాలవరం గ్రామంలో ఒక వర్గానికి చెందిన శ్మశాన వాటికను ఎంపిక చేశారు. దానిని గ్రామస్థులు, గ్రామ పెద్దల అంగీకారంతో ఇళ్ల స్థలాలుగా అభివృద్ధి చేశారు. అదే గ్రామంలో మరో వర్గానికి చెందిన శ్మశానాన్ని ఇరు వర్గాలు ఉపయోగించుకోవాలని సూచించారు.

జి. దొంతమూరు గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలు మరణించగా.. ఆమె వర్గానికి చెందిన వారు, బంధువులు తమ ఆనవాయితీ ప్రకారం ఇళ్ల స్థలాల కోసం అభివృద్ధి చేసిన స్థలంలోనే ఖననం చేసేందుకు సిద్ధమవ్వగా, అభివృద్ధి చేసిన స్థలంలో ఖననం చేయొద్దని అధికారులు, మరొక వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అయితే.. రంగంపేట తహశీల్దార్ వై.జయ వారితో చర్చలు జరిపి మరొక స్థలాన్ని తాత్కాలికంగా కేటాయిస్తున్నట్టు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వగా మహిళలు వెళ్లిపోయారు. మిగిలిన వారు కొత్తగా కేటాయించిన స్థలంలో ఖననానికి ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:

జంతువుల కోసం పెట్టిన విద్యుత్​ తీగలు తగిలి వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.