జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తుని నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతంలో దివిస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆయన పర్యటన కొనసాగనుంది. తొలుత పవన్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ పార్టీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవ్వడంతో నాటకీయ పరిణామాల మధ్య అనుమతించారు.
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం నుంచి పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభంకానుంది. ఉదయం పదిన్నరకు ఆయన రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అన్నవరం వెళ్తారు. భోజనం అనంతరం అన్నవరం నుంచి ర్యాలీగా తొండంగి మండలం కొత్తపాకల చేరుకుని.. దివిస్ పరిశ్రమ బాధితుల్ని పరామర్శిస్తారు. అనంతరం దివిస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు.
పనన్ తూర్పుగోదావరి పర్యటన ఖరారుకు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పనన్ కల్యాణ్ పర్యటనకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ నయీం అస్మీ ప్రకటించారు. అదే సమయంలో తుని పర్యటన కోసం రాజమహేంద్రవరం వస్తానని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. జనసేనాని పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నానన్న ఎస్పీ ప్రకటనపై జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. SP అందుబాటులో లేకపోవడంతో చివరకుఏఎస్పీ కరణం కుమార్ ను కలిసి అనుమతివ్వాలని కోరారు. కార్యాలయం గేటు వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. చివరకు పనవ్ పర్యటనకు అనుమతిస్తున్నట్టు పోలీసులు చెప్పారని జనసేన నాయకులు తెలిపారు.
పవన్ పర్యటనకు అనుమతి ఇచ్చినట్లు తనతో SP ఫోన్‌లో చెప్పినట్లు జనసేన నేత నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. జనసేనాని పర్యటనను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదీ చదవండి