ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పోతవరంలో రైతు భరోసా కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పంటకు మద్దతు ధర కల్పించేందుకే సర్కారు ఈ వెసులుబాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్ముల కొండలరావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కోతుల బెడదను తప్పించిన పురపాలక సిబ్బంది