East Godavari district: తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని పి.గన్నవరం ప్రధాన పంటకాలువ పొంగిపొర్లడంతో స్థానిక వీధులన్నీ జలమయం అయ్యాయి. రెండు రోజులుగా కాలనీల్లో నీరు నిల్వ ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కోళ్లవారి వీధి, నాయిబ్రహ్మణ వీధి, కొత్త వెంకటేశ్వరస్వామి కాలనీలతో పాటు పలు పల్లపు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.
కాలువకు అధిక మొత్తంలో నీరు వదిలిన ప్రతీసారి ముంపునకు గురవుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇళ్ల చుట్టూ చేరిన నీరు సుమారు నెల రోజుల వరకు కూడా వెనక్కి వెళ్లదని.. దుర్వాసనతో పాటు దోమలు విజృంభిస్తాయని వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా సమస్య తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో జరిగే అంతర్వేది ఉత్సవాల సందర్భంగా.. మంచినీటి చెరువులోకి అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో కాల్వ కెపాసిటీకి మించి నీటిని విడుదల చేయడంతో పి.గన్నవరం ప్రధాన పంటకాల్వ పొంగిపొర్లింది.
ఇదీ చదవండి: 'ఆ ఘటనకు కారకులైన వారిపై.. కఠిన చర్యలు తీసుకోవాలి'