తన తండ్రి చింతా బుల్లయ్య పనిచేసిన ఆసుపత్రికి లక్షా 60 వేల విలువైన జంబో ఆక్సిజన్ సిలిండర్లను అందించాడు అమెరికాలో స్థిరపడిన ఆయన కుమారుడు చింతా వెంకట గణేష్. ఈ మేరకు యానాం ప్రభుత్వ ఆసుపత్రి అధికారులకు వాటిని అందించాడు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... అత్యవసర పరిస్థితిలో ఆక్సిజన్ కోసం ఇబ్బందులు పడకుండా ఈ పని చేసినట్టు వెంకట గణేష్ పేర్కొన్నారు. దాత కుటుంబసభ్యులను అధికారులు అభినందించారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి... కొత్తగా 8,835 పాజిటివ్ కేసులు