పంటకు సాగు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 15 నుంచి కాలువలకు సాగునీరు విడుదల చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలవనున్న నేపథ్యంలో కాలువ చివరి ఆయకట్ట వరకూ సాగునీరు సక్రమంగా అందాలంటే కాలువలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన నీటి పారుదల శాఖ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పంట కాలువల గట్లపైన ఉండే చెట్లు కొమ్మలు విరిగిపోయి పంట కాలువల్లో పడి ఉన్నాయి. ఈ క్రమంలో అడివితూడు సహా ఇతర మొక్కలు కాలువల్లో నిల్వ ఉన్న కొద్దిపాటి నీటికి అవి పెరిగిపోయాయి.
వెంటనే మరమ్మతులు చేపట్టాలి : అన్నదాతలు
ప్రస్తుతం ఖరీఫ్ సాగు నీటి ప్రవాహానికి ఆ మొక్కలు ఆటంకం కలిగించనున్న నేపథ్యంలో అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. జూన్ 15న కాలువలకు సాగునీరు విడుదల చేయనున్న సందర్భంగా పంట కాలువలు శుభ్రం చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
10 పంట కాలువలు..
జిల్లాలోని 431 కిలోమీటర్ల మేర 10 ప్రధాన పంట కాలువలు సహా 2024 కిలోమీటర్ల పొడవునా సుమారు రెండు వేల పిల్ల కాలువలు ఉన్నాయి. వీటిని ఖరీఫ్ సాగుకు అనుకూలంగా సాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా శుభ్రం చేయాలని అధికారులకు సూచించినా ప్రయోజనం లేదంటూ అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికైనా వేగంగా మరమ్మతులు చేపట్టి ప్రవాాహానికి అడ్డేమీ లేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేస్తున్నారు.
ఇవీ చూడండి : Fine: ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.11.30 కోట్లు జరిమానా