తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలోని బెల్లంకొండ వారి గ్రూపు నివాసగృహాల మధ్య ఓఎన్జీసీ గ్యాస్ పైపు లైను స్వల్ప లీకేజీ అయ్యింది. ఈ పైపులైన్ ద్వారా మోరి జీపీస్ కేంద్రానికి గ్యాస్ సరఫరా జరుగుతుంది. స్థానికులు వెంటనే స్పందించి సఖినేటిపల్లి పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు పైప్ లైన్లు లీక్ అవుతున్న స్థలాన్ని పరిశీలించి.. ఓఎన్జీసీ అధికారులకు సమాచారం తెలిపారు.
సాంకేతిక సిబ్బంది లీకేజీని అరికట్టారు. నిత్యం గ్యాస్ పైపులైన్ లీకేజీలతో భయాందోళనలకు గురువుతున్నామని.. లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఓఎన్జీసీ అధికారి సత్యనారాయణ పరిశీలించారు.
ఇదీ చదవండి: