తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో రేబిస్ వ్యాధితో ఓ వ్యక్తి మృతి చెందాడు. వెదిరేశ్వరం గ్రామానికి చెందిన రాయుడు వీర దుర్గాప్రసాద్(30)ను గత నెల మూడో తేదిన పిచ్చికుక్క కరిచింది. దీంతో ఊబలంక పిహెచ్సీలో చికిత్స చేయించుకున్నాడు. ఈ నెల 9వ తేదిన అనారోగ్యంగా ఉండటంతో కుటుంబసభ్యులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. రేబిస్ వ్యాధి సోకడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
ఇదీ చదవండి: 'మరపడవల్లో భౌతికదూరం తప్పనిసరి'