తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మూలస్థాన అగ్రహారానికి చెందిన రేలంగి నాగేశ్వరరావు, అల్లం గంగారావులు మోటార్ సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా...రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది. నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా... గంగారావుకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం..