తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పర్ల సత్యనారాయణ అనే వ్యక్తి.. అతడి వదిన అంత్యక్రియలకు వెళ్లి వస్తున్న సమయంలో ఘటన జరిగింది. సత్యనారాయణ ద్విచక్రవాహనంపై రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తుండగా.. చెముడులంక వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం అతడిని ఢీకొంది. బాధితుని తలకు తీవ్రగాయమవ్వటంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో వాహనదారుడికి గాయాలుకాగా.. రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి: