తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి వద్ద.. జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు టైరు పేలడంతో... రహదారి పక్కనే పింగాణీ సామగ్రి అమ్మే వ్యాపారులపైకి దూసుకుపోయి గోతిలో పడింది.
ఘటనలో ఒక వ్యాపారి మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయపడ్డారు. మృతుడిని రాజస్థాన్‌కి చెందిన సంచార జీవి పప్పు లాల్‌గా గుర్తించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: