ETV Bharat / state

గుర్తుకొస్తున్నాయి..37 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు... చేసే అల్లరి... స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు... వారితో కలిసి ఆడిన ఆటలు... చిన్న చిన్న గ్యాంగ్​లు... అవన్నీ ఓ మధురమైన క్షణాలు. మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ ముప్పై ఏడేళ్ల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు.... తూర్పు గోదావరి జిల్లా యూ కొత్తపల్లిలోని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు.

యూ కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ముప్పై ఏడేళ్ల తీపి జ్ఞాపకాలు
author img

By

Published : Oct 5, 2019, 10:42 PM IST

యూ కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ముప్పై ఏడేళ్ల తీపి జ్ఞాపకాలు

తూర్పుగోదావరి జిల్లా యూ కొత్తపల్లిలోని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. 1981-82 విద్యా సంవత్సరం నాటి పూర్వపు విద్యార్థులు ముప్పై ఏడేళ్ల తర్వాత వారు చదువుకున్న పాఠశాలలో కలుసుకుని ఆనందంగా గడిపారు. వాట్సప్ వేదికగా గత మూడు నెలల నుంచి మిత్రులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. అప్పట్లో వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు. చదువు అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఒకరోజు ముందుగానే గ్రామాలకు చేరుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు. వారు చదువుకున్న రోజుల్లో కొన్ని మధుర జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ సందడి చేశారు. చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురు స్నేహితులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం మృతి చెందిన గురువులు, స్నేహితులకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు.

ఇదీ చూడండి: నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో... పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.