నటుడు సోనూసూద్‌ను కలిసేందుకు ఓ వృద్ధుడు సాహసం చేశారు. స్కూటీపై 1450 కిలోమీటర్లు ప్రయాణించి ముంబయి చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన 69 ఏళ్ల బొండా సోమరాజు చిరు వస్త్ర వ్యాపారి. కరోనా నేపథ్యంలో సోనూసూద్ చేపట్టిన సేవా కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారు. ఎలాగైనా ఆయనను కలవాలని అనుకున్నారు. ఇంట్లో తెలిస్తే వెళ్లనివ్వరని భావించి..ఓ పనిపై బయటకు వెళ్తున్నానని చెప్పి స్కూటీపై ఈ నెల 15న ఇంటి నుంచి బయలుదేరారు. పగటిపూట రోజూ 300 నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఐదు రోజుల తర్వాత ఆగస్టు 20న ముంబయిలోని సోనూసూద్ నివాసానికి చేరుకున్నారు.
అక్కడ సోనూసూద్ తనతో మాట్లాడుతూ..ఈ వయసులో ఇంత దూరం ఎందుకు వచ్చారని...ఏదైనా చెప్పాలనుకుంటే సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేస్తే సరిపోతుందని, జాగ్రత్తగా ఇంటికి వెళ్లండని చెప్పారని సోమరాజు పేర్కొన్నారు. ఆయన సూచన మేరకు అక్కడ స్కూటీని పార్శిల్ చేసి.. రైలులో బయలుదేరి 24న ఇంటికి చేరుకున్నట్లు సోమరాజు వివరించారు.
ఇదీ చదవండి
CM directions to collectors: రుణాలపై బ్యాంకర్లతో కలెక్టర్లు మాట్లాడాలి: జగన్