కరోనా వ్యాప్తి నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తునిలో శని, ఆదివారాల్లో పూర్తి స్థాయిలో లాక్డౌన్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉదయం కాసేపు రైతు బజార్, నిత్యావసర దుకాణాలు తెరుస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో అధికారులు చర్చించి దుకాణాలు, రైతు బజార్లు సైతం శని, ఆదివారాల్లో తెరవకుండా పూర్తిగా లాక్డౌన్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజలు దీనికి సహకరించాలని అధికారులు కోరారు.
ఇదీ చదవండి: రాజమహేంద్రవరంలో దంపతుల ఆత్మహత్య