పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో నూరు శాతం ఓటింగ్ జరిపించాలనే లక్ష్యంతో .. యానాం రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ వినూత్న ప్రచారం చేపట్టారు. ప్రధాన కూడలిలో మోడల్ పోలింగ్ ఏర్పాటు చేసి ఓటర్లకు అందించే సేవలు తెలిసేలా ఫ్లెక్సీలు పెట్టారు. 60 కేంద్రాల్లో రెండింటిని మోడల్ పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేశారు.
అందరికీ అనుకూలంగా..
అందులో.. సమాచార కేంద్రం, వృద్ధులు, వికలాంగులు వేచి ఉండేందుకు ప్రత్యేక గదులు, ఓటరు.. లోపలున్న బ్యాలెట్ పెట్టే దగ్గరకు వెళ్లే వరకూ పచ్చని తివాచీలు పరిచారు. కొవిడ్ దృష్ట్యా ప్రతీ కేంద్రం వద్ద శానిటైజర్లు, మాస్క్‌లను సిద్ధంగా ఉంచారు.
ఇవీ చూడండి...: తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల కవాతు