ఎన్టీఆర్ జయంతిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. తెదేపా నాయకుడు గన్ని కృష్ణ నివాళి అర్పించారు. పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు, కళ్లజోళ్లు, గ్లౌజులు పంపిణీ చేశారు. ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టి పేదలకు మేలు చేకూర్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందని అభిప్రాయపడ్డారు.
జగ్గంపేటలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. తెదేపా సీనియర్ నాయకులు, ఎస్వి ప్రసాద్.. రాజస్థాన్ నుంచి వలస వచ్చి తిండి లేక ఇబ్బందిపడుతున్న సుమారు 50 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. తెదేపాను స్థాపించిన ఎన్టీఆర్ పేదవారి అభ్యున్నతికి కృషి చేశారని చెప్పారు.
ఇదీ చదవండి: Polavaram: పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఏరియల్ సర్వే కోసం నిధులు కేటాయింపు