తూర్పుగోదావరి జిల్లా తునిలో రాజా ప్రభుత్వ కళాశాలలోని క్రీడా ప్రాంగణంలో ఓకేషనల్ తరగతులు నిర్వహిస్తున్నారు. అక్కడ సుమారు వంద మందికిపైగా చదువుతున్నారు. ఈ ప్రాంగణానికి రక్షణ గోడ లేకపోవడం వల్ల రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. మందుబాబులు ఇక్కడే మద్యం సేవిస్తున్నారు. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోంచి వాడేసిన పీపీఈ కిట్లను ప్రాంగణంలోనే పడేస్తున్నారు. మద్యం సీసాలు, చుట్టూ చెత్తకుప్పలు, దుర్వాసన మధ్య విద్యార్థులు విద్యానభ్యసించాల్సి వస్తోంది.
ఇక్కడ చదువుకోవడానికి వాతావరణం అనుకూలంగా లేదని విద్యార్థులు అంటున్నారు. తాగు నీరు, మూత్రశాలలు వంటి కనీస సదుపాయాలు లేవని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. దీనిపై అధ్యాపకులను 'ఈటీవీభారత్' వివరణ కోరగా.. సమస్యలను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
ఇదీచదవండి
ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జలను తప్పించాలని గవర్నర్కు ఎస్‌ఈసీ లేఖ