కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నా జన సంచారం మాత్రం రహదారులపై ఏ మాత్రం తగ్గడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఈ జిల్లాలోనే నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసుల్లో మొదటి స్థానానికి జిల్లా ఎగబాకింది. ఓ వైపు నిబంధనలు పాటిస్తూ అత్యవసర పనులున్న వారు మాత్రమే బయటకు రావాలని అధికారులు హెచ్చరిస్తున్నా... జనం రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. జిల్లా అంతటా నిన్న కర్ఫ్యూ అమలు చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి వుంది. దీంతో జనం ఎక్కడికక్కడ రద్దీ కొనసాగింది. రాజమహేంద్రవరం దేవీచౌక్ సెంటర్లో అధిక రద్దీ కొనసాగింది. కూరగాయల దుకాణాల వద్ద కూడా నిబంధనలు పాటించకుండా కొనుగోళ్లు చేస్తున్నారు. వైరస్ ఉద్ధృతి కారణంగా ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిబంధనలు బేఖాతరు..విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రజలు - east godavari district latest news
కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా జనాల్లో ఏ మాత్రం భయం కనిపించడం లేదు. తమకేమీ పట్టనట్లు రోడ్లపై ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు.
కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నా జన సంచారం మాత్రం రహదారులపై ఏ మాత్రం తగ్గడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఈ జిల్లాలోనే నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసుల్లో మొదటి స్థానానికి జిల్లా ఎగబాకింది. ఓ వైపు నిబంధనలు పాటిస్తూ అత్యవసర పనులున్న వారు మాత్రమే బయటకు రావాలని అధికారులు హెచ్చరిస్తున్నా... జనం రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. జిల్లా అంతటా నిన్న కర్ఫ్యూ అమలు చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి వుంది. దీంతో జనం ఎక్కడికక్కడ రద్దీ కొనసాగింది. రాజమహేంద్రవరం దేవీచౌక్ సెంటర్లో అధిక రద్దీ కొనసాగింది. కూరగాయల దుకాణాల వద్ద కూడా నిబంధనలు పాటించకుండా కొనుగోళ్లు చేస్తున్నారు. వైరస్ ఉద్ధృతి కారణంగా ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చూడండి-కాకినాడలో రైతు బజార్లు కిటకిట..బారులు తీరిన ప్రజలు