తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ... సముద్రపు చేపను కొనుగోలు చేసింది. కూరకు అన్ని సిద్ధం చేసుకొని చేపను ముక్కలుగా కోసేందుకు సిద్ధమైంది. కత్తితో చేపను కొయ్యగానే.. ఆశ్చర్యపోవడం గృహిణి వంతైంది. చేప కడుపులో ఏకంగా తొమ్మిది చిన్న చేపలున్నాయి. చేప పిల్లలన్ని ఒకే పరిమాణంతో ఆకర్షణీయంగా ఉండడంతో.. వాటిని చూసేందుకు అందరూ ఆసక్తి చూపారు. సాధారణంగా చేపలు గుడ్లు పెడతాయని అందరికి తెలిసినప్పటికీ... కొన్ని జాతులకు చెందిన సొర చేపలు పిల్లల్ని కంటాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి...